బాబు దూరదృష్టివల్లే మనం అమెరికాలో ఉన్నాం- జయరాం కోమటి

బాబు దూరదృష్టివల్లే మనం అమెరికాలో ఉన్నాం- జయరాం కోమటి

24-09-2018

బాబు దూరదృష్టివల్లే మనం అమెరికాలో ఉన్నాం- జయరాం కోమటి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టివల్లనే నేడు అమెరికాలో దాదాపు 5 లక్షలకుపైగా తెలుగువాళ్ళు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీరంగంలో రాణించగలిగారని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి అన్నారు.  న్యూయార్క్‌లో ముఖ్యమంత్రి పాల్గొన్న మీట్‌ అండ్‌ గ్రీట్‌ సమావేశంలో జయరామ్‌ కోమటి పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి దార్శనికత, పరిపాలన అనుభవం ఆంధ్రప్రదేశ్‌కు, ప్రజలకు ఎంతో ఉపయోగపడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడును గెలిపించాల్సిన బాధ్యత మనపైన ఉందని, అందరూ ఎన్నారై టీడిపిలో సభ్యులుగా ఉండి చంద్రబాబును గెలిపిద్దామని చెప్పారు.