ర్యాలీ ఫర్ రివర్స్ కి మద్దతిద్దాం

ర్యాలీ ఫర్ రివర్స్ కి మద్దతిద్దాం

02-09-2017

ర్యాలీ ఫర్ రివర్స్ కి మద్దతిద్దాం

ఈషా ఫౌండేషన్‌ అధినేత యోగీ సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ ఫర్‌ రివర్స్‌ పేరుతో దేశంలోని నదులను కాపాడుకునేందుకు విస్తృత ప్రచారం జరగనుంది. ఈకార్యక్రమానికి సామాన్యుడి నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు తమ మద్దతుని తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ర్యాలీ ఫర్‌ రివర్స్‌కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా భవిష్యత్తు తరాలకు మంచినీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంటోందని, నదులను కాపాడాల్సిన బాధ్యత మనందరిది అని అన్నారు. నదులు ఎన్నో తరాలుగా మనల్ని పోషిస్తున్నాయి. ఇప్పుడు ఆ నదులు ఇంకిపోతున్నాయి. ఎండిపోతున్నాయి, భవిష్యత్‌ తరాలకు మంచి నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే వాటిని మనం కాపాడుకోవాలని అన్నారు. నదులును కాపాడేందుకు ర్యాలీ ఫర్‌ రివర్స్‌ కార్యక్రమానికి మద్దతివ్వాలని ఈ సందర్భంగా చిరంజీవి కోరారు.