పిట్ట కథ పోస్టర్‌ని విడుదల చేసిన త్రివిక్రమ్‌

పిట్ట కథ పోస్టర్‌ని విడుదల చేసిన త్రివిక్రమ్‌

27-01-2020

పిట్ట కథ పోస్టర్‌ని విడుదల చేసిన త్రివిక్రమ్‌

కొన్ని కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అతి తక్కువ నిడివితో పెద్ద పెద్ద విషయాలను చెబుతుంటారు. అందుకేనేమో అలాంటి వాటిని పిట్టకథలు అంటుంటారు. అలాంటి ఓ ఆసక్తికరమైన పిట్టకథను వెండితెరపై చూపించబోతోంది భవ్య క్రియేషన్స్‌. ఈ నిర్మాణ సంస్థ తాజాగా తెరకెక్కించిన క్యూట్‌ కథకు ఓ పిట్టకథ అనే టైటిల్‌ పెట్టారు. ఈ చిత్రం పోస్టర్‌ని మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ విడుదల చేశారు. చెందు ముద్దు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ఈ కథ విన్నప్పుడే చాలా ఆసక్తికరంగా అనిపించింది. కథ నచ్చింది. టైటిల్‌ బావుంది. ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుందనే నమ్మకంతో ఈ టైటిల్‌ను పోస్టర్‌ని రిలీజ్‌ చేయడానికి ఒప్పుకున్నాను అని అన్నారు.