ద కశ్మీర్‌ ఫైల్స్‌ ప్రారంభం

ద కశ్మీర్‌ ఫైల్స్‌ ప్రారంభం

27-01-2020

ద కశ్మీర్‌ ఫైల్స్‌ ప్రారంభం

కశ్మీరి పండిట్ల జీవితం నేపథ్యంలో రూపొందిస్తున్న ద కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా చిత్రీకరణ మొదలైంది. వివేక్‌ అగ్నిహోత్రి దర్శకుడు. ఆయన హైదరాబాద్‌కు విచ్చేసి చార్మినార్‌ సమీపంలోని లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వివేక్‌ అగ్నిహోత్రి చిత్ర విశేషాలు తెలియజేస్తూ కశ్మీరి పండిట్ల జీవితం నేపథ్యం గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన విషయాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఈ సబ్జెక్ట్‌పై విస్త్రృతంగా పరిశోధన చేసి విషయ సేకరణ చేశాం. స్క్రిప్ట్‌ రచనకే సుదీర్ఘకాలం తీసుకున్నా. ఈ ఏడాదే సినిమాను విడుదల చేస్తాం. సినిమా రిలీజైన అనంతరం ఈ అంశంపై ఓ పుస్తకం రాయాలనుకుంటున్నా అన్నారు.