'క్లూ' ఫస్ట్‌ లుక్‌ విడుదల

'క్లూ' ఫస్ట్‌ లుక్‌ విడుదల

25-01-2020

'క్లూ' ఫస్ట్‌ లుక్‌ విడుదల

పృథ్వీశేఖర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం క్లూ. జర్నీ బిగిన్స్‌ ఉపశీర్షిక. రమేష్‌ రాణా దర్శకుడు. సుభాని అబ్దుల్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను హీరో శ్రీకాంత్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాణిజ్య హంగులు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో దర్శకుడు రమేష్‌రాణా ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు. రిస్కీ యాక్షన్‌ సీక్వెన్స్‌లలో సాహసోపేతంగా హీరో పృథ్వీశేఖర్‌ నటించారు. ర్యాప్‌రాక్‌షకీల్‌ బాణీలు బాగున్నాయి అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న థ్రిల్లర్‌ చిత్రమిది. కథను నమ్మి ఈ సినిమాను రూపొందిస్తున్నాం అని చెప్పారు. సబీనా జాసిన, సుభాంగ్‌ పంథ్‌, సంజనానాయుడు, రాజారవీంద్ర, షాయాజీషిండే, దేవ్‌గిల్‌, జీవా ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.