కేంద్ర మంత్రిని కలిసిన అలీ

కేంద్ర మంత్రిని కలిసిన అలీ

25-01-2020

కేంద్ర మంత్రిని కలిసిన అలీ

ప్రముఖ హాస్య నటుడు అలీ హాలీవుడ్‌ చిత్రాల్లో నటించనున్నారు. హాలీవుడ్‌కు చెందిన మార్టినీ ఫిల్మ్స్‌, పింక్‌ జాగ్వర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్త నిర్మాణంలో తెలుగు రచయిత, దర్శకుడు జగదీష్‌ దానేటి దర్శకత్వంలో ఈ సినిమాలు రూపొందించనున్నారు. చిత్రీకరణకు సంబంధించి అనుమతుల విషయమై అలీ, జగదీష్‌ దానేటి కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌ను కలిశారు. అనంతరం అలీ మాట్లాడుతూ మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. దర్శకుడు జగదీష్‌ దానేటి మాట్లాడుతూ నాలుగేళ్ల శ్రమ ఫలితంగా నేరుగా హాలీవుడ్‌ చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం తనకు దక్కిందన్నారు.