మహాశివరాత్రి కానుకగా ప్రెజర్‌ కుక్కర్‌

మహాశివరాత్రి కానుకగా ప్రెజర్‌ కుక్కర్‌

25-01-2020

మహాశివరాత్రి కానుకగా ప్రెజర్‌ కుక్కర్‌

సాయిరోనక్‌, ప్రీతి అస్రాని జంటగా నటించిన సినిమా ప్రెజర్‌ కుక్కర్‌. ప్రతి ఇంట్ల ఇదే ల్లొలి అనేది ఉప శీర్షిక. సుజోయ్‌, సుశీల్‌ దర్శకులు. అభిషేక్‌ పిక్చర్స్‌ సమర్పణలో సుశీల్‌ సుభాష్‌ కారంపురి, అప్పిరెడ్డి నిర్మించారు. ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఈ సినిమా పోస్టర్‌ను అభిషేక్‌ నామా ఆవిష్కరించారు. దర్శకుల్లో ఒకరైన సుజోయ్‌ మాట్లాడుతూ న్యూ ఏజ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. పిల్లలు వేరే దేశలో స్థిరపడితే ఆ ప్రభావం కుటుంబం, సమాజంపై ఎలా ఉంటుందనేది ఇందులో ప్రధానాంశం. మా వ్యక్తిగత అనుభవాలతో పాటు, అనేకమంది అనుభవాలను జోడించి కథ రాశాం. మన ఇంట్లో, పక్కింట్లో జరిగే కథలా అనిపిస్తుంది అని చెప్పారు. ఈ కథకు కనెక్ట్‌ అయి విడుదల చేయడానికి ముందుకొచ్చా అని సమర్పకుడు అభిషేక్‌ నామా అన్నారు. వినోదం, సందేశం, మేళవించిన సినిమా ఇది. శివరాత్రి సందర్భంగా వచ్చే నెల 21న సినిమా విడుదల చేస్తాం అని నిర్మాతలు తెలిపారు.