మరోసారి జోడీగా కియారా ?

మరోసారి జోడీగా కియారా ?

24-01-2020

మరోసారి జోడీగా కియారా ?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 27వ చిత్రానికి సంబంధించిన వార్తలు సినీవర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. మహేష్‌ 25వ చిత్రం మహర్షి కి దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి ప్రస్తుతం ఈ సూపర్‌స్టార్‌ 27వ చిత్రానికి స్కిప్ట్ర్‌ను సిద్దం చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మర్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ బాబు కొత్త మూవీ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి హీరోయిన్‌ ఇంకా ఎవరు ఖరారు కాలేదు. కానీ నమత్ర మాత్రం ఈ చిత్రం కోసం కియారా అద్వానీని హీరోయిన్‌గా తీసుకోవాలంటూ దర్శకుడు వంశీ పైడిపల్లికి రికమండ్‌ చేసినట్లుగా తెలిసింది. తన భర్తకు కియారా అద్వానీ అయితేనే సరైన జోడీ అని ఆమె భావిస్తోందట. ఎత్తు, కలర్‌తో పాటు చాలా విషయాల్లో కూడా మహేష్‌కు కియారా సరైన జోడీ అంటూ ఆమె భరత్‌ అనే నేను చిత్రం సమయంలోనే చెప్పింది. ఆ చిత్రంలో మహేష్‌, కియారాల జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అందుకే మరోసారి వీరిద్దరి కాంబోను సెట్‌ చేయాల్సిందిగా వంశీ పైడిపల్లికి నమ్రత సలహా ఇచ్చిందట. దీంతో మహేష్‌ 27వ చిత్రంలో కియారా అద్వానీ నటించడం ఖారైనట్టేనని అంటున్నారు.