సూసైడ్‌ క్లబ్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన వర్మ

సూసైడ్‌ క్లబ్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన వర్మ

24-01-2020

సూసైడ్‌ క్లబ్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన వర్మ

శివ రామచంద్రవరపు, ప్రవీణ్‌ యండమూరి, సాకేత్‌ వెంకట కృష్ణ, చందన కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రం సూసైడ్‌ క్లబ్‌. శ్రీనివాస్‌ బొగడపాటి దర్శకుడు. ప్రవీణ్‌ ప్రభు వెంకటేశం నిర్మాత. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం ట్రైలర్‌ను రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ జనరేషన్‌ దర్శకులు పాత్‌ బ్రేకింగ్‌ సినిమాలు తీస్తున్నారు. ట్రైలర్‌ బావుంది అని అన్నారు. థ్రిల్లర్‌ కథాంశంతో సాగే సినిమా ఇది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాను విడుదల చేస్తాం అని దర్శక నిర్మాతలు అన్నారు.