చిత్రీకరణ పూర్తి చేసుకున్న జాను

చిత్రీకరణ పూర్తి చేసుకున్న జాను

23-01-2020

చిత్రీకరణ పూర్తి చేసుకున్న జాను

శర్వానంద్‌, సమంత జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం జాను. తమిళంలో విజయవంతమైన 96కి రీమేక్‌ ఇది. సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రాణం నా ప్రాణం నీతో ఇలా..గానం తొలి గానం పాడే వేళ అంటూ సాగే ఈ చిత్రంలోని గీతాన్ని విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పాటని చిన్నయి, గౌతమ్‌ భరద్వాజ్‌ ఆలపించారు. గోవింద్‌ వసంత సంగీతం అందించారు. టీజర్‌కీ, తొలి లిరికల్‌ వీడియో పాటకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రేమలోని గాఢతని తెలియజెప్పే చిత్రమిది. త్వరలోనే మిగిలిన పాటల్ని విడుదల చేస్తామని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: మహేంద్రన్‌ జయరాజ్‌.