పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రభుదేవా

పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రభుదేవా

23-01-2020

పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రభుదేవా

ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న ఓ తమిళ చిత్రాన్ని కృష్ణమనోహర్‌ ఐ.పి.ఎస్‌ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇందులో ఆయన తొలిసారి పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. పవనపుత్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆర్‌.సీతారామరాజు నిర్మిస్తున్నారు తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 7న విడుదల కానుంది. నివేదా పేతురాజ్‌ కథానాయికగా నటిస్తున్నది. సంఘ విద్రోహ శక్తులను ఏమాత్రం ఉపేక్షించని శక్తివంతుడైన పోలీస్‌ అధికారిగా ప్రభుదేవా పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది. యాక్షన్‌ ఘట్టాలు రొమాంచితంగా సాగుతాయి. వాణిజ్య అంశాల కలబోతగా అందరిని అలరించే చిత్రమిది. పోలీస్‌ కథాంశాల్లో ఓ కొత్త అనుభూతిని పంచుతుంది అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: రాజేష్‌, సంగీతం: డి.ఇమ్మాన్‌, దర్శకత్వం: ముఖిల్‌ చెల్లప్పన్‌.