అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం

అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం

21-01-2020

అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం

భారత, తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను కేంద్ర ప్రభుత్వం ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ 2019 అవార్డుతో సత్కరించింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ అవార్డును ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ నా సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు, చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌కు రక్తదానం చేసిన దాతలకు ఈ అవార్డును అంకితమిస్తున్నా. భవిష్యత్తులోను సమాజం కోసం నా సేవలు కొనసాగిస్తాను అని అన్నారు.