అమెరికాకు సూపర్‌స్టార్‌ ఫ్యామిలీ

అమెరికాకు సూపర్‌స్టార్‌ ఫ్యామిలీ

20-01-2020

అమెరికాకు సూపర్‌స్టార్‌ ఫ్యామిలీ

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఓ పర్‌ఫెక్ట్‌ ఫ్యామిలీ మ్యాన్‌. షూటింగ్‌ లేకపోతే చాలు కుటుంబంతో గడిపేందుకు ప్రాధాన్యతనిస్తారు. ఎక్కువ రోజులు బ్రేక్‌ దొరికితే మాత్రం తన కుటుంబ సభ్యులతో విదేశాలకు విహార యాత్ర ప్లాన్‌ చేసుకుంటారు. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్‌ పూర్తి కావడంతో ఈసారి కూడా మహేష్‌ తన కుటుంబ సభ్యులతో హాలిడే ట్రిప్‌కు బయలుదేరారు. మహేష్‌ సతీమణి నమ్రత ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా తెలిపారు. ఇక సూపర్‌స్టార్‌ ఫ్యామిలీ అమెరికాకు వెళ్లిందని... ఈ ట్రిప్‌ రెండు నెలల పాటు కొనసాగుతుందని సమచారం. ఈ ట్రిప్‌లో మహేష్‌, నమ్రత, గౌతమ్‌, సితారలతో పాటు వారి ఫ్యామిలి ఫ్రెండ్‌ మెహర్‌ రమేష్‌ కూడా బయలుదేరి వెళ్లారు.