కేరళ లో విరాటపర్వం

కేరళ లో విరాటపర్వం

20-01-2020

కేరళ లో విరాటపర్వం

దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. సాయి పల్లవి కథానాయిక. ప్రియమణి కీలక పాత్రధారి. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి నిర్మాతలు. ప్రస్తుతం కేరళలో చిత్రీకరణ జరుగుతోంది. హాలీవుడ్‌ పోరాట నిపుణుడు స్టీఫెన్‌ రిచర్డ్‌ ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నీదీ నాదే ఒకే కథ తో ఆకట్టుకున్న దర్శకుడు వేణు. ఈ సారి వైవిధ్యమైన కథతో వస్తున్నారు. ఇదో ప్రేమ కథ. భావోద్వేగభరితమైన సన్నివేశాలు ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. ఈశ్వరీరావు, జరీనా వాహాబ్‌ తదితరులు నటిస్తున్నారు.