ఫైటర్‌కు అనన్యా జోడీ అవుతారా?

ఫైటర్‌కు అనన్యా జోడీ అవుతారా?

20-01-2020

ఫైటర్‌కు అనన్యా జోడీ అవుతారా?

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఫైటర్‌ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్‌ సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తారు. ఈ సినిమాలో చేయబోయే ఫైట్స్‌ కోసం విజయ్‌ థాయ్‌ల్యాండ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ వారంలో ముంబైలో ప్రారంభం కానుందని తెలిసింది. తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ అనన్యా పాండే పేరు తెరపైకి వచ్చింది. మరి ఫైటర్‌కు అనన్య జోడీ అవుతారా? ఈ సినిమాతో సౌత్‌కు ఎంట్రీ ఇస్తారా? వెయిట్‌ అండ్‌ సీ. ఇదిలా ఉంటే స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా అనన్య వెండితెర ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కార్తీక్‌ ఆర్యన్‌ పతీపత్నీ ఔర్‌ ఓ చిత్రంలో నటించి మంచి పేరు సంపాదించుకున్న అనన్య ప్రస్తుతం ఖాలీ పీలి అనే చిత్రంలో నటిస్తున్నారు.