19న అల వైకుంఠపురములో విజయోత్సవ వేడుక

19న అల వైకుంఠపురములో విజయోత్సవ వేడుక

18-01-2020

19న అల వైకుంఠపురములో విజయోత్సవ వేడుక

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం అల వైకుంఠపురములో. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. పూజాహెగ్డే కథానాయికగా నటించింది. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల మందుకొచ్చింది. ఈ చిత్ర విజయోత్సవ వేడుకను ఈ నెల 19న వైజాగ్‌లో నిర్వహించబోతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ సినిమాకు అత్యద్భుతమైన స్పందన లభిస్తున్నది. అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ను సాధించింది. ఓవర్‌సీస్‌లో చక్కటి వసూళ్లు లభిస్తున్నాయి. ఈ విజయాన్ని అభిమానులతో పంచుకోవడం కోసం విజయోత్సవ వేడుకను నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి చిత్రబృందం మొత్తం హాజరుకానున్నారు అని తెలిపారు.