మైదాన్‌ నుంచి తప్పుకునే ఆలోచనలో కీర్తి ?

మైదాన్‌ నుంచి తప్పుకునే ఆలోచనలో కీర్తి ?

18-01-2020

మైదాన్‌ నుంచి తప్పుకునే ఆలోచనలో కీర్తి ?

మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకొని దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకట్టుకుంది చెన్నై సోయగం కీర్తి సురేష్‌. ప్రస్తుతం దక్షిణాదిన వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్‌ మైదాన్‌ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన ప్రఖ్యాత పుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. అజయ్‌దేవ్‌గణ్‌ కథానాయకుడిగా నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారు. అమిత్‌శర్మ దర్శకుడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సినిమా నుంచి తప్పుకునే ఆలోచనలో కీర్తి సురేష్‌ ఉందని తెలిసింది. కథానుగుణంగా పెద్ద వయస్కురాలైన మహిళ పాత్రను పోషించాల్సి రావడంతో కెరీర్‌పరంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని కీర్తిసురేష్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. దక్షిణాది సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కీర్తిసురేష్‌ డేట్స్‌ సర్దుబాటు సమస్యగా మారిందని.. అందుకే మైదాన్‌ చిత్ర విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.