పవన్‌ కల్యాణ్‌ సరసన పూజా హెగ్డే ?

పవన్‌ కల్యాణ్‌ సరసన పూజా హెగ్డే ?

18-01-2020

పవన్‌ కల్యాణ్‌ సరసన పూజా హెగ్డే ?

పవన్‌ కల్యాణ్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారా? అంటే ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అవుననే అంటున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలో ఈ జోడీని వెండితెరపై ప్రేక్షకులు చూడొచ్చు. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో ఏఎం రత్నం ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొఘల్‌ సామాజ్య్ర నేపథ్యంలో రూపొందునున్న ఈ చారిత్రక చిత్రంలో కథనాయకుడి పాత్ర రాబిన్‌ హుడ్‌ తరహాలో ఉంటుందట. అతడి సరసన కథానాయికగా పూజా హెగ్డే అయితే బావుంటుందని దర్శకుడు భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల అమెను కలిసి కథ వివరించారట. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.