తిరుమలలో సరిలేరు నీకెవ్వరు బృందం

తిరుమలలో సరిలేరు నీకెవ్వరు బృందం

18-01-2020

తిరుమలలో సరిలేరు నీకెవ్వరు బృందం

తిరుమలలో సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం సందడి చేసింది. చిత్ర బృందం నిజపాద దర్శనంలో శ్రీవారిని దర్శించుకుంది. వారిలో హీరో మహేష్‌బాబు, విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, నిర్మాత దిల్‌రాజ్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో దేదపండితులు ఆశీర్వచనం చేసి, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. సరిలేరు నీకెవ్వరు సినిమా విజయం సాధించడంతో శ్రీవారిని దర్శించుకున్నట్టు చిత్ర బృందం తెలిపింది.