జ్వాలాముఖీ గీతాలు విడుదల

జ్వాలాముఖీ గీతాలు విడుదల

08-11-2019

జ్వాలాముఖీ గీతాలు విడుదల

వైఎఫ్‌ క్రియేటివ్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం జ్వాలాముఖి. హరిశంకర్‌ మట్టగుంట దర్శకుడు. యూసఫ్‌ యం.డి. నిర్మాత. ఈ చిత్ర గీతావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, చైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌ ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న కథా చిత్రమిది. కథానుగుణంగా చక్కటి సంగీతం కుదిరింది. తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. చిన్న సినిమాలకు ఏమైన సమస్యలున్నాయని తెలిస్తే మా తరపున సహకారం అందిస్తాం అన్నారు. సినిమాలన్నీ ఒకటే అని.. చిన్న పెద్ద తేడాలు లేవని నిర్మాత గురురాజ్‌ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కిరీటి, సంగీతం: రాజ్‌కిరణ్‌, సాహిత్యం: గురుచరణ్‌.