తెలుగు ప్రేక్షకులకు మరో బయోపిక్‌

తెలుగు ప్రేక్షకులకు మరో బయోపిక్‌

08-11-2019

తెలుగు ప్రేక్షకులకు మరో బయోపిక్‌

తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో బయోపిక్‌ రానుంది. తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకొన్న రఘుపతి వెంకయ్యనాయుడు ఈ నెల 29న విడుదల కానుంది. సీనియర్‌ నటుడు నరేశ్‌ ఇందులో టైటిల్‌ పాత్ర పోషించారు. బాబ్జీ దర్శకత్వంలో సతీశ్‌ మండవ ఈ చిత్రం నిర్మించారు. రఘుపతి వెంకయ్యగారు పుట్టిన మచిలీపట్నంలో, హైదరాబాద్‌లో షూటింగ్‌ చేశాం. తెలుగు సినిమాకు ఆద్యుడు రఘుపతి వెంకయ్య అనే విషయం ఈ జనరేషన్‌లో చాలా మందికీ తెలీయదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఈ రోజుల్లో కెమెరా కొని సినిమాలు తీశారు. సినిమా అంటే ఇలా ఉంటుందని తెరపై సినిమాలు వేసి చూపించారు. వెంకయ్య గొప్పతనాన్ని నేటి తరానికి చాటాలని ఓ డాక్యుమెంటరీలా కాకుండా కమర్షియల్‌ సినిమాగానే నిర్మించాం. వెంకయ్య పాత్రలో నరేశ్‌ ఒదిగిపోయారు అని తెలిపారు సతీశ్‌. సినిమా పరంగా కొంత స్వేచ్ఛ తీసుకొని, అవసరమైన సన్నివేశాలు సృష్టించి చిత్రం తీసినట్లు దర్శకుడు బాజ్జీ చెప్పారు.