అట్టహాసంగా కమల్‌ హాసన్‌ జన్మదినం

అట్టహాసంగా కమల్‌ హాసన్‌ జన్మదినం

08-11-2019

అట్టహాసంగా కమల్‌ హాసన్‌ జన్మదినం

నటుడి నుంచి రాజకీయవేత్తగా మారిన కమల్‌ హాసన్‌ 65 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా సినిమా ఇండ్రస్టీలో అడుగుపెట్టి 60 ఏళ్లు పూర్తయ్యాయి. చైల్డ్‌ ఆర్టిస్టుగా కోట్లాది మంది మదిలో స్థానం పదిలం చేసుకున్నారు. దేశంలోనే ప్రముఖ సినీ నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడిలో అతని సృగృహంలో కుటుంబ సభ్యుల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మూడు రోజుల పాటు పుట్టిన రోజు కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కమల్‌ హసన్‌ ప్లాన్‌ చేశారు. కమల్‌ హసన్‌ తన తండ్రి శ్రీనివాసన్‌ విగ్రహాన్ని వారి పూర్వీకుల ఇంట్లో ఆవిష్కరించారు. కమల్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు.