హీరోగా అశోక్‌ గల్లా ఎంట్రీ

హీరోగా అశోక్‌ గల్లా ఎంట్రీ

08-11-2019

హీరోగా అశోక్‌ గల్లా ఎంట్రీ

గల్లా జయదేవ్‌ కుమారుడు, మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ కథానాయకుడిగా తెరంగ్రేటం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్‌ చిత్రాలతో ఆకట్టుకున్న శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తారు. పద్మావతి గల్లా నిర్మాత. శనివారం (నవంబర్‌ 10న) ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. నరేష్‌, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇదో వినోదాత్మక కథ. గల్లా అశోక్‌ లోని అన్ని కోణల్నీ బయటకు తీసుకురావడానికి దర్శకుడు ప్రయత్నిస్తున్నారని చిత్రబృందం తెలిపింది.