సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన వివి వినాయక్‌

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన వివి వినాయక్‌

07-11-2019

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన వివి వినాయక్‌

ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు సాదర స్వాగతం లభించింది. అనంతరం ఆయన ముఖ్యమంత్రిని దుశ్శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా వినాయక్‌ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో మెజార్టీ సాధించిన ముఖ్యమంత్రి జగన్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. నేటితో ఆయన చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు రెండేళ్లు పూర్తియిన సందర్భంగా ఆయన్ను అభినందించినట్లు తెలిపారు. ఆయన కృషి, పట్టుదల, దీక్ష, దక్షత నేటి యువతకు ఆదర్శమన్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజల అవసరాలను నెరవేర్చగలరన్న ఆశాభావం వ్యక్తపరిచారు. పాదయాత్రలో ఆయన చూసిన, విన్న అన్ని సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారమార్గం లభిస్తోందని చెప్పారు.