అసలేం జరిగిందంటే.. ఫస్ట్‌ లుక్‌ విడుదల

అసలేం జరిగిందంటే.. ఫస్ట్‌ లుక్‌ విడుదల

12-10-2019

అసలేం జరిగిందంటే.. ఫస్ట్‌ లుక్‌ విడుదల

మహేంద్రన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం అసలు ఏం జరిగిందంటే. జి.ఎస్‌.ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్‌ బండారి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీపల్లవి, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ను హీరో విజయ్‌ సేతుపతి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అంశాలతో తెరకెక్కుతున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఊహకందని మలుపులతో ప్రతి క్షణం థ్రిల్‌ను పంచుతుంది. బాల నటుడు మహేంద్రన్‌ ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. ఫస్ట్‌లుక్‌ను విజయ్‌ సేతుపతి విడుదల చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం అని తెలిపారు. హరితేజ, షఫి, ఫణి, షాని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం, సాహిత్యం: చరణ్‌ అర్జున్‌, సినిమాటోగ్రఫీ: కర్ణ.