అమితాబ్‌ బచ్చన్‌ రూ.51లక్షలు విరాళం

అమితాబ్‌ బచ్చన్‌ రూ.51లక్షలు విరాళం

12-10-2019

అమితాబ్‌ బచ్చన్‌ రూ.51లక్షలు విరాళం

నష్టాల్లో ఉన్న రైతులు, వరద బాధితులు, దేశ కోసం ప్రాణాలు త్యాగం చేసే సైనిక కుటుంబాలు బాధితులెవరైనా, కారణమేదైనా తన వంతు ఆర్ధిక సాయం అందించడంలో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ ఎప్పుడూ ముందే ఉంటారు. తన పుట్టిన రోజు సందర్భంగా అమితాబ్‌ తాజాగా వరదలతో తీవ్రంగా నష్టపోయిన బీహార్‌ ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సహాయనిధికి రూ.51లక్షలు విరాళం అందించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రం దెబ్బతినడం నన్ను చాలా బాధించింది. ఈ వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు నా వంతు సాహాయం అందిస్తున్నా అంటూ అమితాబ్‌ సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా బీహార్‌లో వర్షాలు ముంచెత్తుతున్న విషయం విదితమే. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.