లండన్‌లో ప్రభాస్‌ జన్మదిన వేడుకలు ?

లండన్‌లో ప్రభాస్‌ జన్మదిన వేడుకలు ?

12-10-2019

లండన్‌లో ప్రభాస్‌ జన్మదిన వేడుకలు ?

గత నాలుగేళ్లుగా సెట్స్‌ మధ్యే బిజీగా గడిపారు ప్రభాస్‌. బాహుబలి, సాహో సినిమాల చిత్రీకరణ వల్ల ఆయనకు కోరుకున్న విరామం దక్కలేదు. పుట్టినరోజు వేడుకల్ని కూడా సెట్స్‌లోనే జరుపుకున్నారు. ఈ నెల 23న ప్రభాస్‌ జన్మదినోత్సవం. ఈ పుట్టినరోజుతో ఆయన 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. దాంతో ఈ బర్త్‌ డే ఎంతో ప్రత్యేకమైనదని అభిమానులు భావిస్తున్నారు. లండన్‌లో ప్రభాస్‌ జన్మదిన వేడుకలకు ప్లాన్‌ చేశారని తెలిసింది. ఈ నెల 19న బాహుబలి సినిమా సంగీత విభావరి లండన్‌లో జరగనుంది. దీనికి చిత్ర సంగీత దర్శకుడు కీరవాణితో పాటు దర్శకుడు రాజమౌళి, ప్రభాస్‌, రానా, అనుష్క హాజరుకానున్నారు. ఈవెంట్‌ పూర్తయిన తర్వాత ప్రభాస్‌ లండన్‌లోనే బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ప్లాన్‌ చేశారని చెబుతున్నారు.