సైరా బృందాన్ని సత్కరించిన టి.సుబ్బరామిరెడ్డి

సైరా బృందాన్ని సత్కరించిన టి.సుబ్బరామిరెడ్డి

11-10-2019

సైరా బృందాన్ని సత్కరించిన టి.సుబ్బరామిరెడ్డి

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సైరా చిత్రబృందాన్ని కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి ఆత్మీయ సత్కారం పేరుతో అభినందించారు. ఈ వేడుకలో పాల్గొన్ని అతిథులు అందరూ చిరంజీవి నటనను కొనియాడారు. సైరా సినిమాను ప్రశంసించారు. భారతీయులు గర్వించదగిన సినిమా అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో చిరంజీవి, తమన్నా, దర్శకుడు సురేందర్‌ రెడ్డి, పరుచూరి, రత్నవేలు, నిర్మాత రామ్‌ చరణ్‌, సాయిమాధవ్‌, శాంత బయోటిక్‌ చైర్మన్‌ డా.వరప్రసాద్‌ రెడ్డి, అల్లు అరవింద్‌, బ్రహ్మాజీ, మురళీమోహన్‌, డా.రాజశేఖర్‌, దిల్‌రాజు, ఈనాడు ఎండి కిరణ్‌ దంపతులు, విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, క్రిష్‌, బోనీకపూర్‌, సురేష్‌బాబు, కేవీపీ, సీఎం.రమేష్‌, అజారుద్దీన్‌ తదితరులు హాజరయ్యారు. డా.గురువారెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించిన సైరా కేక్‌ను బహుకరించారు.