కైలాసపురం కింగ్స్‌ టీజర్‌ విడుదల

కైలాసపురం కింగ్స్‌ టీజర్‌ విడుదల

11-10-2019

కైలాసపురం కింగ్స్‌ టీజర్‌ విడుదల

రమేష్‌ కుర్మాపు, గరిమా సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం కైలాసపురం కింగ్స్‌. కులదీప్‌ రాజన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. క్రౌండ్‌ ఫండింగ్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ ఈ సినిమా చూశాను. వైజాగ్‌ నేపథ్యంలో జరిగే మాస్‌ ఎంటర్‌టైనింగ్‌ చిత్రమిది అన్నారు. మాస్‌ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది అన్నారు కులదీప్‌. పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది అన్నారు రమేష్‌. ప్రేమలోని కొత్త కోణాన్ని దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు అన్నారు గరిమా సింగ్‌. ఈ సినిమాతో రమేష్‌కి ఇంకా మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది అన్నారు సందీప్‌. నిర్మాతలు రిజ్వాన్‌, తేజ్‌ వైజాగ్‌ పాల్గొన్నారు.