18న సైరా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ?

18న సైరా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ?

11-09-2019

18న సైరా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ?

సైరా కోసం మెగా టీమ్‌ భారీ ప్రమోషన్లను ప్లాన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ వేడుకను కర్నూల్‌ ప్రాంతో నిర్వహించాలని చిరంజీవి, రామ్‌చారణ్‌ భావిస్తున్నట్టు గతంలోనే వార్తలొచ్చాయి. తాజా సమాచారం మేరకు ఈ నెల 18న ఈ వేడుకను జరపాలని మెగా కాంపౌండ్‌ భావిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌ కల్యాణ్‌ రానున్నారనే వార్తలపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. సినిమాకున్న క్రేజ్‌ మూలంగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ సైతం భారీ ఎత్తున జరుగుతోంది. సినీ స్టార్లు అమితాబ్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు, తుమన్నాలు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.