సాహో సెన్సార్‌ పూర్తి

సాహో సెన్సార్‌ పూర్తి

24-08-2019

సాహో సెన్సార్‌ పూర్తి

ప్రభాస్‌ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సాహో. ట్రైలర్‌ ఇటీవల విడుదలై సంచలనాలు సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ను పొందింది. సెన్సార్‌ సభ్యులు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించడం విశేషం. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్‌ క్లాస్‌ సినిమాగా వస్తోంది సాహో. హాలీవుడ్‌ సినిమాల స్థాయిలో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు సుజీత్‌. గల్లీలో సిక్స్‌ ఎవడైనా కొడతాడు... స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్‌ ఉంటది అంటూ ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌కి సోషల్‌ మీడియా బ్రహ్మరథం పట్టింది. ప్రభాస్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ శ్రద్దాకపూర్‌ పవర్‌పుల్‌ క్యారెక్టర్‌ చేసింది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్‌ విజయ్‌, జాకీష్రాప్‌ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈచిత్రాన్ని భారీ ఖర్చుతో యువి క్రియేషన్స్‌ నిర్మించింది. ఈనెల 30న సాహో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.