మరో బయోపిక్‌లో విద్యాబాలన్‌

మరో బయోపిక్‌లో విద్యాబాలన్‌

24-08-2019

మరో బయోపిక్‌లో విద్యాబాలన్‌

విద్యాబాలన్‌ ఈ మధ్య వరుసగా విద్యావంతురాలి పాత్రల్లోనే కనిపిస్తున్నారు. మిషన్‌ మంగళ్‌ లో ఇస్రో శాస్త్రవేత్తగా కనిపించిన విద్యా, ప్రస్తుతం హ్యూమన్‌ కంప్యూటర్‌ అనే పేరు పొందిన గణిత ప్రావీణురాలు శకుంతలా దేవి బయోపిక్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. అను మీనన్‌ దర్శకురాలు. ఈ సినిమాలో తన లుక గురించి విద్యాబాలన్‌ మాట్లాడుతూ ఈ పాత్రలో బాబ్డ్‌ హెయిర్‌ కట్‌లో కనిపిస్తాను. నా సౌతిండియన్‌ ఫేస్‌ కట్‌ ఈ మ్యాథ్స్‌ జీనియస్‌కు బాగా మ్యాచ్‌ అవుతుందనుకుంటున్నాను. శకుంతలగారి 20 ఏళ్ల నుంచి వృద్ధాప్యం వయసు వరకు అన్ని లుక్స్‌లో కనిపిస్తాను అన్నారు. ఇదే కాకుండా ఇందిరాగాంధీ బయోపిక్‌లోనూ నటిస్తున్నారు విద్యా.