పహిల్వాన్‌ ట్రైలర్‌ విడుదల

పహిల్వాన్‌ ట్రైలర్‌ విడుదల

23-08-2019

పహిల్వాన్‌ ట్రైలర్‌ విడుదల

సుదీప్‌ కథానాయకుడిగా నటించిన అనువాద చిత్రం పహిల్వాన్‌. ఎస్‌.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో సాగుతుంది. రెజ్లర్‌ పాత్రలో సుదీప్‌ కనిపిస్తాడు. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. సెప్టెంబర్‌ ప్రధమార్ధంలో ఈ సినిమాను విడుదల చేస్తారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి, ఆకాంక్ష సింగ్‌ కీలక పాత్రధారులు. ఇటీవలే చిరంజీవి ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. గురువారం ట్రైలర్‌ విడుదల చేశారు. అర్జున్‌ జన్యా సంగీతం అందించిన ఈ సినిమాకు కరుణాకర్‌ ఛాయాగ్రహణం అందించారు. సంభాషణలు హనుమాన్‌ చౌదరి, పాటలు రామజోగయ్య శాస్త్రి.