సాయితేజ్‌ సరసన ఇస్మార్ట్‌ నభా

సాయితేజ్‌ సరసన ఇస్మార్ట్‌ నభా

23-08-2019

సాయితేజ్‌ సరసన ఇస్మార్ట్‌ నభా

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండుగే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. దీనితో పాటు మరో రెండు చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు తేజ్‌. సుబ్బు అనే కొత్త దర్శకుడితో ఒకటి, దేవాకట్టాతో మరొకటి. సుబ్బుతో ఆయన చేయబోతున్న చిత్రానికి భోగవల్లి ప్రసాద్‌ నిర్మాత. ఇటీవల ఇస్మార్ట్‌ శంకర్‌తో సూపర్‌హిట్‌ కొట్టిన నభా నటేశ్‌ను తేజ్‌ సరసన కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌లో ఉన్న ఈ చిత్రం నవంబర్‌లో సెట్స్‌కెళ్లే అవకాశముంది.