జేమ్స్ బాండ్ 25వ సినిమా టైటిల్ : 'నో టైం టు డై'

జేమ్స్ బాండ్ 25వ సినిమా టైటిల్ : 'నో టైం టు డై'

22-08-2019

జేమ్స్ బాండ్ 25వ సినిమా టైటిల్ : 'నో టైం టు డై'

నో టైమ్‌ టు డై.. జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌లో 25వ సినిమా టైటిల్‌. చనిపోవడానికి సమయం లేదు అని దానర్థం. డేనియల్‌ క్రేగ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 3న ఇండియాలో, ఏప్రిల్‌ 8న అమెరికాలో విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థలు ఎంజిఎం. ఇయాన్‌ ప్రొడక్షన్స్‌ ప్రకటించాయి. టైటిల్‌తో పాటు విడుదలతేదీ ప్రకటించడంతో బాండ్‌ సిరీస్‌ అభిమానులు అమితానందంతో ఉన్నారు. నిజానికి, ఈ చిత్రానికి ఏ రీజన్‌ టు డై టైటిల్‌ అనుకున్నారట. ఏమైందో ఏమో టైటిల్‌తో పాటు టైటిల్‌ మీనింగ్‌ కూడా మారిందిప్పుడు.