విలన్‌ పాత్రలకూ సిద్ధమే

విలన్‌ పాత్రలకూ సిద్ధమే

22-08-2019

విలన్‌ పాత్రలకూ సిద్ధమే

అవకాశం వస్తే విలన్‌ పాత్రలకూ సిద్దమే అన్నారు శేఖర్‌ వర్మ. ఆయన హీరోగా నటించిన చిత్రం నివాసి. సతీష్‌ రేగళ్ల దర్శకుడు. వివియా, విద్య నాయికలు. ఈ సందర్భంగా మీడియాతో శేఖర్‌ మాట్లాడుతూ ఒక వ్యక్తి ప్రయాణం నేపథ్యంలో నివాసి తెరకెక్కింది. ఎన్నారై కుర్రాడిగా కనిపిస్తా. స్వదేశానికి వచ్చిన ఆ కుర్రాడు తన మూలాలు వెతుక్కుంటూ ప్రయాణం సాగిస్తాడు. అతడి అనుభవాల సమాహారమే ఈ సినిమా. మాది కాకినాడ దగ్గర గొల్లపాలెం. నటనలో నాకు రజనీకాంత్‌గారే స్ఫూర్తి. హీరోగా అంగుళీక, యుగన్‌ సినిమాలు చేస్తున్నా. బాలకృష్ణ, కె.ఎస్‌.రవికుమార్‌ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నా. బాలకృష్ణగారితో జై సింహాలోనూ నటించా అన్నారు.