రజనీ అభిమానులకు పండగే

రజనీ అభిమానులకు పండగే

22-08-2019

రజనీ అభిమానులకు పండగే

రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దర్బార్‌ చిత్రీకరణ పూర్తి కావొస్తోంది. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దీంతో రజనీ తర్వాతి చిత్రం ఏంటి? అనే చర్చ మొదలైంది. రజనీకాంత్‌ తర్వాతి సినిమాకు శివ దర్శకత్వం వహించనున్నారట. ఇంతకుమందు అజిత్‌తో వేదాలం, వీరమ్‌, వివేగమ్‌, విశ్వాసం వంటి మాస్‌ సినిమాలు తీశారు శివ. రజనీకాంత్‌కు కూడా ఆయన ఓ మాస్‌ స్టోరీని చెప్పారని, వీరి కాంబినేషన్‌లో సినిమా ఆల్మోస్ట్‌ ఓకే అయిపోయిందని చైన్నై టాక్‌. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు కోడంబాక్కమ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ప్రచారమే నిజమైతే రజనీ అభిమానులకు వచ్చే ఏడాది డబుల్‌ ధమకామే. సంక్రాంతికి ఒక సినిమా, దీపావళికి ఒక సినిమా అంటే అభిమానులకు పండగే కదా.