ఏపీలో రూ.500 కోట్లతో స్టూడియో

ఏపీలో రూ.500 కోట్లతో స్టూడియో

22-08-2019

ఏపీలో రూ.500 కోట్లతో స్టూడియో

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సూర్యలంకలో రూ.500 కోట్లతో సినిమా స్టూడియో, థీమ్‌ వాటర్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు సినీ రచయిత కోన వెంకట్‌ తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి ఈ ప్రాజెక్టు చేపడతామన్నారు. స్థానిక అధికారుల అనుమతితో సూర్యలంకలో సర్వే చేస్తున్నట్లు వివరించారు. అమెరికాలోని డిస్నీ ల్యాండ్‌ థీమ్‌ పార్క్‌ తరహాలో దీనిని అభివృద్ధి చేస్తామని తెలిపారు.