ఏదైనా జరగొచ్చు ప్రిరిలీజ్‌ ఈవెంట్‌

ఏదైనా జరగొచ్చు ప్రిరిలీజ్‌ ఈవెంట్‌

21-08-2019

ఏదైనా జరగొచ్చు ప్రిరిలీజ్‌ ఈవెంట్‌

శివాజీరాజా తనయుడు విజయ్‌ రాజా హీరోగా పరిచయం అవుతూ పూజా సొలంకీ, సాషా సింగ్‌ హీరోయిన్లుగా రమాకాంత్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఏదైనా జరగొచ్చు. వెబ్‌బ్రెయిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సుధర్మ్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై సుదర్శన్‌ హనగోడు నిర్మిస్తున్నారు. తమిళస్టార్‌ బాబి సింహా నెగిటివ్‌ రోల్‌లో కన్పించనున్నారు. వైనత్యానంద్‌ కుమారుడు రాఘవ, ప్రముఖ దర్శకుడు విజయభాస్కర్‌ అల్లుడు రవి శివతేజ కీలకపాత్రలో నటిస్తున్నార. ఈ నెల 23న చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. నటుడు శివాజీరాజా మాట్లాడుతూ దర్శకుడే సినిమాకు ప్రాణం అన్నారు. అలాగే ఈ సినిమా కూడా రమాకాంత్‌దే అని అన్నారు. మ్యూజిక్‌ చాలా బాగుందని, నటీనటులు టెక్నీషియన్లు అందరికి బెస్ట్‌ విషెస్‌ అన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు శ్రీకాంత్‌ పెండ్యాల, బాబీసింహ, దర్శకుడు కె.రమాకాంత్‌, హీరో విజయ్‌ రాజా, కో ప్రొడ్యూసర్‌ సుదర్శన్‌ హనగోడు తదితరులు మాట్లాడారు.