సరికొత్త లుక్‌లో బాలయ్య

సరికొత్త లుక్‌లో బాలయ్య

21-08-2019

సరికొత్త లుక్‌లో బాలయ్య

నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం థాయ్‌లాండ్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఇది వరకు కనిపించని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయన లుక్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. గడ్డం, మీసం ఉన్న లుక్‌లో బాలయ్యను చూసి థ్రిల్‌ అవుతున్నారు. లోకల్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ ఆధ్వర్యంలో సినిమా కీలకమైన భారీయాక్షన్‌ ఎపిసోడ్స్‌ చిత్రీకరిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, భూమికా చావ్లా, జయసుధ కీలయ పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ సంగీతం, రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు.