నాన్నగారివల్లే రాక్షసుడులో అవకాశం

నాన్నగారివల్లే రాక్షసుడులో అవకాశం

21-08-2019

నాన్నగారివల్లే రాక్షసుడులో అవకాశం

రాక్షసుడు సినిమాలో నటించడానికి కారణం మా నాన్నగారే. తను తమిళవర్షన్‌ చూసి బాగుందన్నారు. అనుకోకుండా తెలుగులో రీమేక్‌ అవుతున్న సందర్భంగా దర్శకుడు వర్మ నన్ను సంప్రదించారు. బిజీ వల్ల కథ వినలేదు. నాన్నగారే పట్టుబట్టి కథ ఒక్కసారి వినమని చెప్పారు. అలా కథ విన్న వెంటనే టీచర్‌ పాత్ర చేయాలని డిసైడ్‌ అయ్యాను అని అనుపమ పరమేశ్వర్‌ తెలియజేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలై నాల్గవ వారంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సత్యనారాయణ, దర్శకుడు వర్మ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ స్ఫూర్తితో మంచి చిత్రాలు నిర్మిస్తామని వారు వెల్లడించారు.