'చూసి చూడంగానే' ఫస్ట్‌లుక్‌ విడుదల

'చూసి చూడంగానే' ఫస్ట్‌లుక్‌ విడుదల

20-08-2019

'చూసి చూడంగానే' ఫస్ట్‌లుక్‌ విడుదల

శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం చూసీ చూడంగానే. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ధర్మపథ క్రియేషన్స్‌ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మితమవుతోంది. సినిమాలో హీరో పెళ్లిళ్ళ ఫొటోగ్రాఫర్‌ కావడం వల్ల సోమవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం కావడంతో ఫస్ట్‌లుక్‌ను డి.సురేష్‌బాబు విడుదల చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వేద రామన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.