అజయ్‌ దేవగణ్‌, కీర్తి జోడీ కట్టారు

అజయ్‌ దేవగణ్‌, కీర్తి జోడీ కట్టారు

20-08-2019

అజయ్‌ దేవగణ్‌, కీర్తి జోడీ కట్టారు

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌, కీర్తి సురేష్‌ జోడీ కట్టారు. వీరిద్దరూ కలసి ఓ నిజ జీవిత కథా చిత్రంలో నటిస్తున్నారు. దీనికి మైదాన్‌ అనే పేరును ఖరారు చేశారు. పుట్‌బాల్‌ క్రీడ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారత పుట్‌బాల్‌ జట్టు కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ పాత్రలో అజయ్‌ నటిస్తున్నారు. 1951, 1962 ఆసియన్‌ గేమ్స్‌ సాకర్‌ పోటీల్లో భారత జట్టును విజేతగా నిలపడానికి సయ్యద్‌ పడిన తపన, అమలు చేసిన వ్యూహాలను ఈ చిత్రం ఆవిష్కరించనుంది. బదాయి హో దర్శకుడు అమిత్‌ శర్మ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సందర్భంగా గ్లోబ్‌ ఆకారంలో వున్న పుట్‌ బాల్‌ పోస్టర్‌ను అజయ్‌ ట్విటర్‌లో పంచుకున్నారు.