ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

20-08-2019

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

తెలుగు సినీ స్టిల్‌ ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ తరపున 181వ వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే ఉత్సవాలు హైదరాబాద్‌ వైభవగా జరిగాయి. తెలుగు సినిమా స్టిల్‌ ఫొటోగ్రాఫర్ల అధ్యక్షుడు జి.శ్రీను, జనరల్‌ సెక్రటరీ కే శ్రీను, వైఎస్‌ ప్రెసిడెంట్‌ సుబ్బారావు.యస్‌, ట్రెజరర్‌ వీరభద్రమ్‌ తదితరులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, అల్లరి నరేష్‌, వైవీయస్‌ చౌదరి, రసూల్‌ ఎల్లోర్‌ తదితరులు హాజరయ్యారు. ఇదే వేదిక మీద సీనియర్‌ ఫొటోగ్రాఫర్లు శ్యామల్‌ రావు, శ్యామ్‌లను సత్కరించారు. సినీ స్టిల్‌ ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.