20న 'సైరా' టీజర్‌ విడుదల

20న 'సైరా' టీజర్‌ విడుదల

19-08-2019

20న 'సైరా' టీజర్‌ విడుదల

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా సైరా. 151వ సినిమాగా చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషించారు. సినమా టీజర్‌ను చిరు పుట్టిన రోజున ఆగస్టు 22న విడుదల చేస్తారన్న కథనాలు నిన్నటి వరకూ వినిపించాయి. అయితే నిర్మాత రామ్‌చరణ్‌ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ను సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 20న సైరా టీజర్‌ బయటకు రాబోతుంది. టీజర్‌కు ఇక రెండు రోజులే ఉందంటూ ఓ అట్రాక్టివ్‌ పోస్టర్‌ను సైతం షేర్‌ చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్‌పై సైరా ను దర్శకుడు సురేందర్‌ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించాడు. బాలీవుడ్‌, సౌత్‌ స్టార్‌ ఆర్టిస్టులు అమితాబ్‌ బచ్చన్‌,విజయ్‌ సేతుపలి, జగపతి బాబు, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నా. స్పెషల్‌ అట్రాక్షన్‌గా చిరంజీవి సోదరుడు పవన్‌ కల్యాణ్‌ ఈ చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. పోస్ట్‌ ప్రొడక్షన్స్‌లో వున్న ఈ సినిమా అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజున థియేటర్లకు రానుంది.