ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్‌ వేడుక

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్‌ వేడుక

19-08-2019

ఘనంగా 'సాహో' ప్రీ రిలీజ్‌ వేడుక

ప్రభాస్‌ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన హైరేంజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సాహో.. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్ల్‌ క్లాస్‌ సినిమాగా రాబోతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ అంచనాలను పెంచేసిది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భగా హీరో ప్రభాస్‌ అశేష అభిమానులనుద్దేశించి మాట్లాడారు. ఈ సినిమా గురించి టీం మొత్తం చాలా చక్కగా పని చేశారన్నారు. అన్ని విభాగాలు చేసిన కృషి అనిర్వచనీయమని అన్నారు. ఈ చిత్రం మొదటిరోజు నుంచి అనిల్‌గారు మంచి సపోర్ట్‌ చేశారంటూ చిత్రానికి సనిచేసిన విభాగాధిపతులను పేరుపేరునా అభినందిచారు. దర్శకుడు సుజిత్‌ గురించి మాట్లాడుతూ. సుజిత్‌ యువకుడు ఆయన చెప్పిక కథ 40 ఏళ్ల వ్యక్తి చెప్పిన వ్యక్తిగా చెప్పాడన్నారు. ఏడాది క్రితం ప్లానింగ్‌ జరిగిందన్నారు. షూటింగ్‌ స్టార్‌ అయ్యాక అన్పించింది. చాలా మంచి పెద్ద వాళ్లు ఉన్నారు. ఆయన ఇంత మందిని హ్యాండిల్‌ చేసిన విధానం అభినందనీయమన్నారు. ఈ చిత్రంతో సుజిత్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ అవుతాడేమో అని అన్నారు.

నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ ఈ చిత్రం టీజర్‌ గురించి చాలా ఫోన్లు వచ్చాయన్నారు. ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాతా చాలా మంది అబ్బో అని అన్నారు. ఇది చాలా గొప్ప సినిమా. హాలీవుడ్‌ సినిమాలకు ధీటుగా నిలిచే సినిమా అన్నారు. ఈ విషయాన్ని చాలా మంది చెప్పారన్నారు. గొప్ప ఇంటర్నేషనల్‌ స్టార్‌ అవుతాడని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు వివ వినాయక్‌, రాజమౌళి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, దిల్‌రాజు, హీరోయిన్‌ శ్రద్దాకపూర్‌ తదితరులు మాట్లాడారు. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్‌ భారీ స్థాయిలో నిర్మించింది. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, భూషన్‌ కుమార్‌ నిర్మాతలు.