తెలుగు సినీ రథసారథుల రజతోత్సవ వేడుక

తెలుగు సినీ రథసారథుల రజతోత్సవ వేడుక

19-08-2019

తెలుగు సినీ రథసారథుల రజతోత్సవ వేడుక

సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ ప్రారంభించి 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా వచ్చే నెల 8న తెలుగు సినీ రథసారథుల రజతోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. గచ్చిబౌలి ఇన్‌డోర్‌ స్టేడియం దీనికి వేదిక కానుంది. అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌, నిర్మాతలు కె.ఎస్‌ రామరావు, దిల్‌రాజు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌, మా అధ్యక్షుడు నరేశ్‌, జీవితా రాజశేఖర్‌, రాజీవ్‌ కనకాల తదితరులు పాల్గొని ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

సి.కల్యాణ్‌ మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో 24 శాఖల మీద దాసరి నారాయణరావుగారికి అమితమైన ప్రమే ఉండేది. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే ఈ వేడుక మరోస్థాయిలో జరిగేది అని అన్నారు. సినిమా ప్రారంభానికి ముందే ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ పని మొదలవుతుంది. నిర్మాతలుగా మా పేర్లు పడినా.. ఎక్కువ కష్టం వారిదే ఉంటుంది. ఈ యూనియన్‌ వెల్‌ఫేర్‌కు నా వంతు సాయం చేస్తాం అని కె.ఎస్‌. రామారావు అన్నారు. ఈ వేడుక గ్రాండ్‌ సక్సెస్‌ కావడానికి యావత్‌ సినీ పరిశ్రమ అండగా ఉంటుంది అని దిల్‌ రాజు తెలిపారు.