జాన్వీ కల నెరవేరేనా?

జాన్వీ కల నెరవేరేనా?

19-08-2019

జాన్వీ కల నెరవేరేనా?

దక్షిణాదిలో మీకు ఇష్టమైన హీరో ఎవరు? అంటూ ఓ సందర్భంలో జాన్వీ కపూర్‌కి ప్రశ్న ఎదురైంది. క్షణం ఆలోచించకుండా విజయ్‌ దేవరకొండ పేరు చెప్పింది జాన్వి. అతనితో కలిసి నటించాలన్న కోరికనూ బయటపెట్టింది. జాన్వికి ఆ చాన్స్‌ దర్శకుడు పూరి ఇవ్వనున్నాడా? అన్న కథనాలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య కాపీ విత్‌ కరణ్‌ షోలో తన మనసులో మాట బయటపెట్టిన జాన్వికి- విజయ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం రానే వచ్చిందని అంటున్నారు. ఇస్మార్ట్‌ శంకర్‌ ఇచ్చిన విజయోత్సాహంతో విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి కొత్త ప్రాజెక్టును సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్‌తో సినిమాను అధికారికంగా ప్రకటించేశాడు కూడా. పూరి, చార్మి సంయుక్తంతో ఈ సినిమాను నిర్మించనున్నారు. పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ, వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే, ఈ సినిమాతో జాన్వి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుందా? అన్న చర్చ మొదలైంది. ఆమెనే కథానాయికగా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.