వాల్మీకి ఫస్ట్‌ లుక్‌ విడుదల

వాల్మీకి ఫస్ట్‌ లుక్‌ విడుదల

17-08-2019

వాల్మీకి ఫస్ట్‌ లుక్‌ విడుదల

వరుణ్‌తేజ్‌ కొత్త మాస్‌ లుక్‌ విడుదలైంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వాల్మీకి. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన జిగర్తాండ సినిమాకు ఇది రీమేక్‌. ఇప్పటికే ప్రీ లుక్‌ టీజర్‌ విడుదల చేశారు. తాజాగా సినిమా ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను విడుదల చేశారు. నా సినిమాలో విలనే నా హీరో అంటూ అధర్య చెప్పే డైలాగ్‌తో టీజర్‌ మొదలవుతుంది. వరుణ్‌ స్టైలిష్‌ లుక్‌తో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు. సిగరేట్‌ తాగుతూ వరుణ్‌ నడుస్తూ వచ్చే సీన్‌ ఆకట్టుకుంది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ప్రధానంగా టీజర్‌ కనిపించింది. అందుకే పెద్దోళ్ళు చెప్పిండ్రు.. నాలుగు బుల్లెట్స్‌ సంపాయిస్తే రెండు కాల్చుకోవాలె.. రెండు దాచుకోవాలె అంటూ వరుణ్‌ చెప్పిన డైలాగ్‌తో టీజర్‌ ముగుస్తుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.