అంగరంగ వైభవంగా సైమా వేడుక

అంగరంగ వైభవంగా సైమా వేడుక

17-08-2019

అంగరంగ వైభవంగా సైమా  వేడుక

ఖతార్‌ రాజధాని దోహా వేదికగా జరుగుతున్న సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌లో రామ్‌ చరణ్‌ నటించిన రంగస్థలం కు అవార్డుల పంట పండింది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ గేయ రచయిత, ఇలా మొత్తం 9 విభాగాల్లో అవార్డులు అందుకుని రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత అందరూ ఊహించి నటే మహానటి చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమనటి, ఉత్తమ సహాయనటుడు వంటి మూడు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ఇక సన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ, విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు (గీత గోవిందం), సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ స్టార్‌ కేటగిరీలకు గాను రెండు అవార్డులను సొంతం చేసుకున్నారు. మరో సంచలన చిత్రం ఆర్‌ఎక్స్‌ 100 కూడా ఉత్తమ తొలిచిత్ర నటి తొలిచిత్ర దర్శకుడు, గాయకుడువంటి మూడు విభాగాల్లో అవార్డులు పొందటం విశేషం.